Share News

Bhatti Vikramarka: మహిళలకే చేప పిల్లల పెంపకం బాధ్యత

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:40 AM

రాబోయే రోజుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించేందుకు కార్యాచరణను..

Bhatti Vikramarka: మహిళలకే చేప పిల్లల పెంపకం బాధ్యత

హైదరాబాద్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి రూ.122 కోట్లను విడుదల చేశామన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. హైటెక్‌ సిటీ పక్కన శిల్పారామం వద్ద విలువైన స్థలాన్ని మహిళా సంఘాలకు ఇచ్చి ఆర్థికంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్లను ఏర్పాటు ఆలోచనలో ఉన్నామని భట్టి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 02:40 AM