High Court: నా భర్తకు లైంగిక సామర్థ్యం లేదు.. 90 లక్షల భరణం ఇప్పించండి
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:49 AM
తన భర్తకు లైంగిక సామర్థ్యం లేదని.. వాస్తవాలను దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం క్రూరత్వం కిందికే వస్తుంది కాబట్టి..
హైకోర్టులో ఒక మహిళ పిటిషన్
ఆధారాలు లేవని కొట్టేసిన న్యాయస్థానం
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): తన భర్తకు లైంగిక సామర్థ్యం లేదని.. వాస్తవాలను దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం క్రూరత్వం కిందికే వస్తుంది కాబట్టి.. విడాకులతోపాటు తనకు రూ.90 లక్షల శాశ్వత భరణం ఇప్పించాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టేసింది. తన భర్త రుమటాయిడ్ ఆర్థరైటి్‌సతో బాధపడుతున్నాడని, దానివల్ల అంగస్తంభన సమస్య కలిగిందని.. అతడికి తనతో లైంగిక బంధం కొనసాగించే సామర్థ్యం లేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2013 డిసెంబరు 11న తమకు పెళ్లయిందని.. వెంటనే తాము హనీమూన్‌కు కేరళకు వెళ్లామని, 2014లో కశ్మీర్‌కు రెండోసారి హనీమూన్‌కు వెళ్లామని.. రెండుచోట్లా తన భర్త తనతో శృంగారంలో పాల్గొనలేకపోయాడని తెలిపారు. అతడు వైవాహిక జీవితానికి పనికిరాడని.. సంతానోత్పత్తి సామర్థ్యం లేనివాడని 2017లో నిర్వహించిన వైద్యపరీక్షల్లో తేలిందని, 2018లో అతడు తనను అమెరికాలో వదిలిపెట్టి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. అయితే ఆమె భర్త ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తామిద్దరం చాలాసార్లు శారీరకంగా ఒక్కటయ్యామని కోర్టుకు తెలిపారు. తొలుత తాను అంగస్తంభన సమస్య ఎదుర్కొన్నప్పటికీ, తర్వాత చికిత్స తీసుకున్నానని కోర్టుకు తెలిపారు. తన స్పెర్మ్ కౌంట్ సాధారణంగా ఉందని తెలిపే వైద్యనివేదికను కోర్టుకు సమర్పించారు. ఆ మహిళ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో పిటిషన్‌ను కొట్టేస్తూ జస్టిస్ మౌషమీ భట్టాచార్య, జస్టిస్ మధుసూదన్‌రావు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News