Share News

Ameenpur accident: ఆమె డ్రైవింగ్‌ సరదాకు బాలుడి బలి

ABN , Publish Date - May 20 , 2025 | 05:37 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న మహిళ కారు అదుపుతప్పి ఇద్దరు పిల్లలపైకి దూసుకెళ్లింది. బాలుడు మృతి చెందగా, బాలికకు గాయాలయ్యాయి; డ్రైవింగ్‌ మహిళపై కేసు నమోదైంది.

Ameenpur accident: ఆమె డ్రైవింగ్‌ సరదాకు బాలుడి బలి

కారు నేర్చుకునేందుకు భర్తతో కలిసి గ్రౌండ్‌కు మహిళ

అదుపు తప్పి ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలపైకి దూసుకెళ్లిన వాహనం

తీవ్రగాయాలతో బాలుడి మృతి.. బాలికకు గాయాలు..ఆస్పత్రికి తరలింపు

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘటన

పటాన్‌చెరు, మే 19 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళ కారు డ్రైవింగ్‌ నేర్చుకుంటుండగా వాహనం అదుపుతప్పి అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు తోబుట్టువులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారిలో బాలుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా బాలికకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. సీఐ నరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం అమీన్‌పూర్‌ నవ్యకాలనీలో నివాసముండే మహేశ్వరి అనే మహిళ కారు నేర్చుకునేందుకు సాయంత్రం ఐదు గంటలకు భర్త రవిశేఖర్‌తో కలిసి పక్కనే ఉన్న నర్రెగూడెం గ్రౌండ్‌కు వచ్చారు. ఆ సమయంలో నర్రెగూడెం గ్రామానికి చెందిన శేఖర్‌, అనురాఽధ దంపతుల పిల్లలు మణిధర్‌ వర్మ (10), ఏకవాణి (12) గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. ఆ పిల్లలకు తోడుగా వారి పెద్దనాన్న, పెద్దమ్మలు అక్కడికొచ్చారు. ఈక్రమంలో మహేశ్వరి డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని కారును ముందుకు దూకించింది. అయితే ఆ వాహనం అదుపుతప్పి పిల్లలపైకి దూసుకెళ్లింది. మణిధర్‌ వర్మ, ఏకవాణి కారు చక్రాల కింద నలిగిపోయారు. మణిధర్‌వర్మ అక్కడికక్కడే మృతి చెందగా ఏకవాణిని చికిత్స కోసం హుటాహుటిన అదే కారులో బీరంగూడలోని హరిణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. బాధితుల బంధువుల దాడిలో కారు ధ్వంసమైంది. ప్రమాదంపై ఆదివారం రాత్రి బాధితులు అమీన్‌పూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహేశ్వరి, భర్త రవిశేఖర్‌పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు. పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా సోమవారం సాయత్రం అంత్యక్రియలు నిర్వహించారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:38 AM