మెదక్-ఎల్లారెడ్డి రహదారి విస్తరణకు.. వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు ఆమోదం
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:04 AM
పోచారం వన్యప్రాణుల అభయారణ్యం మీదుగా వెళ్తున్న మెదక్-ఎల్లారెడ్డి రహదారి విస్తరణను వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు ఆమోదించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : పోచారం వన్యప్రాణుల అభయారణ్యం మీదుగా వెళ్తున్న మెదక్-ఎల్లారెడ్డి రహదారి విస్తరణను వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు ఆమోదించింది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు 8వ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. నాగార్జున సాగర్ డివిజన్‌లోని పెద్దగుట్టలో ములుగు 11 కేవీ సబ్‌స్టేషన్, ఎత్తిపోతల పథకం నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. రక్షిత అటవీ ప్రాంతాల్లో ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లు వేయడానికి ప్రతిపాదనలపై బోర్డు సమావేశంలో చర్చించారు.