Share News

Crime: వివాహేతర సంబంధం.. భర్తను దారుణంగా చంపిన భార్య

ABN , Publish Date - Oct 26 , 2025 | 09:14 PM

హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెలగూడలో ఆదివారం దారుణం జరిగింది. భర్తను భార్య ఘోరంగా హతమార్చింది.

Crime: వివాహేతర సంబంధం.. భర్తను దారుణంగా చంపిన భార్య
Jillelguda murder case

ఇంటర్నెట్నెట్ డెస్క్, అక్టోబర్ 26: హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెలగూడలో ఆదివారం దారుణం జరిగింది. భర్తను భార్య ఘోరంగా హతమార్చింది. భార్య వివాహేతర సంబంధం వెలుగుచూడటంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. భర్త విజయ్‌పై కోపం పెంచుకున్న భార్య సంధ్య.. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. సరైన సమయం కోసం వేచి చూసి మాటువేసింది. నిద్రిస్తున్న భర్తను ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంధ్య, విజయ్ మధ్య కొంత కాలంగా విభేదాలు ఉనట్లు గుర్తించారు. ఈ దారుణానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కానిస్టేబుల్ దినేష్ మోసం చేశాడు. మాయమాటలు చెప్పి వివాహితను లోబరచుకున్నాడు. దీంతో సదరు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Scientific Importance Of Cow: గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లే: కేంద్ర మంత్రి బండి సంజయ్

Police firing incident: చాదర్‌ఘాట్‌ కాల్పుల ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 26 , 2025 | 10:03 PM