Share News

KCR Questions Her Loyalty: కవిత ఎందుకిలా చేసింది

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:28 AM

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తన కూతురు కవితను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన కేసీఆర్‌.. ఆమె తీరు పట్ల పార్టీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు...

KCR Questions Her Loyalty: కవిత ఎందుకిలా చేసింది

ఆమెకు ఏం తక్కువ చేశాను?

  • ఎంపీగా గెలిపించాం.. ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చాం

  • మద్యం కేసులో అరెస్టయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టాను

  • బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌.. సస్పెండ్‌ చేస్తే పార్టీ పెడుతుందా? అని ఆరా

  • కవితను బహిష్కరిస్తే మంచిదన్న జగదీశ్‌రెడ్డి!

హైదరాబాద్‌/గజ్వేల్‌/మర్కుక్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తన కూతురు కవితను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన కేసీఆర్‌.. ఆమె తీరు పట్ల పార్టీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కవితను సస్పెండ్‌ చేసే ముందు ఫాంహౌ్‌సలో ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘‘కవితకు ఏం తక్కువ చేశాను? నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసే అవకాశమిచ్చి గెలిపించుకున్నాం. రెండోసారీ చాన్స్‌ ఇచ్చాను. ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాను. మద్యం కేసులో అరెస్టయితే ఎంతో ఖర్చుపెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లతో వాదించాం? అయినా కవిత ఎందుకిలా చేసింది?’’ అని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. కాగా, పార్టీ నేతలు కవితపై తమ అభిప్రాయాలు చెప్పే సమయంలో కొన్ని అంశాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. కవిత సీఎం రేవంత్‌ ఫోల్డర్‌లో పనిజేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు కూడా చూపించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే కవితను సస్పెండ్‌ చేస్తే ఆమె ఏం చేస్తుందోనన్న అంశంపై కూడా కేసీఆర్‌ చర్చించినట్లు, కొత్త పార్టీ పెడుతుందా? అని ఆరా తీసినట్లు తెలిసింది. అయితే సస్పెండ్‌ చేస్తే కాంగ్రె్‌సలో చేరతారని, కవితకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు కేసీఆర్‌కు వివరించారు. దీంతో, ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకవేళ కవితకు మంత్రి పదవి ఇస్తే అది మనకే లాభం’’ అని కేసీఆర్‌ అన్నట్లు సమాచారం. కాగా, కవితను సస్పెండ్‌ చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకెవరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరని, ఎంతటి వారినైనా సస్పెండ్‌ చేస్తారనే భయం కలుగుతుందని కొందరు నేతలు కేసీఆర్‌తో అన్నట్లు తెలిసింది. కవితను సస్పెండ్‌ చేయని పక్షంలో అనేక మంది పార్టీలో ఉంటూ పార్టీకే నష్టం కలిగించేలా వ్యవహరిస్తారని చర్చకు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా కేసీఆర్‌ కూతురి విషయంలో ఏకపక్షంగా ఉంటున్నారని ప్రచారం పెరుగుతుందని, సస్పెండ్‌ చేస్తే వ్యతిరేకంగా పనిచేసే వారికి హెచ్చరికగా ఉండడంతో పాటు గతంలో చెప్పిన విధంగా పార్టీయే తన కుటుంబంగా కేసీఆర్‌ భావించారని ప్రజల్లో ప్రచారం జరుగుతుందని భావించినట్లు తెలిసింది. ఇటీవల కవిత ‘లిల్లీపుట్‌’ అంటూ వ్యాఖ్యానించిన నేత.. ఆమెను బహిష్కరిస్తేనే పార్టీకి మంచిదని చెప్పినట్లు సమాచారం. నేతలందరి అభిప్రాయాలు విన్న కేసీఆర్‌.. చివరికి కవితపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 09:36 AM