Share News

TG News: కేసీఆర్ చేసుకున్న ఒప్పందమే తెలంగాణకు మరణశాసనం: వేదిరె శ్రీరామ్

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:10 PM

కృష్ణా నీటి పంపకాల విషయంలో నాడు కేసీఆర్ చేసుకున్న 299 టీఎంసీల అగ్రిమెంటే తెలంగాణకు మరణ శాసనంగా మారిందని కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్..

TG News: కేసీఆర్ చేసుకున్న ఒప్పందమే తెలంగాణకు మరణశాసనం: వేదిరె శ్రీరామ్

హైదరాబాద్, డిసెంబర్ 23: కృష్ణా నీటి పంపకాల విషయంలో నాడు కేసీఆర్ చేసుకున్న 299 టీఎంసీల అగ్రిమెంటే తెలంగాణకు మరణ శాసనంగా మారిందని కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో శ్రీరామ్ స్పందించారు. కృష్ణా నదీ జలాల పంపకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 811 టీఎంసీలల కేసీఆర్ 299 టీఎంసీలకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నారని శ్రీరామ్ గుర్తు చేశారు. 299 టీఎంసీ లకు అగ్రిమెంట్ చేసుకోవడం వెనక ఉన్న ప్రయోజనాలు ఏంటో కేసీఆర్‌కే తెలియాలన్నారు. నాడు కేసీఆర్ చేసుకున్న 299 టీఎంసీల అగ్రిమెంట్.. నేడు తెలంగాణకు మరణ శాసనంగా మారిందన్నారు. కేసీఆర్ విధనాలే కృష్ణా వాటర్‌లో పాలమూరుకు అన్యాయం జరగడానికి కారణమయ్యాయని చెప్పారు.


కృష్ణా నీటి పంపకాలపై కేసీఆర్ చేసుకున్న ఒప్పందం తెలంగాణకు పెను శాపంగా మారిందని శ్రీరామ్ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకొని 299 టీఎంసీల నీటికి కేసీఆర్ అగ్రిమెంట్ చేసుకున్నారా? అని శ్రీరామ్ ప్రశ్నించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉన్నప్పుడు.. కేసీఆర్ నాడు ఏ విధంగా 299 టీఎంసీలకు అగ్రిమెంట్ చేసుకున్నారని నిలదీశారాయన. 299 టీఎంసీల నీటిని తెచ్చుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటర్‌ను ఉపయోగించుకోవడంలో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు.


ఎన్నికల సమయంలో కేసీఆర్ హడావుడి చేయడం తప్పితే.. ఏ ఒక్క ఎకరానికి కూడా నీరు చేరలేదని శ్రీరామ్ విమర్శించారు. 1050 టీఎంసీల నీటిని ఫ్రైస్‌గా రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని కేటాయింపు చేయాలని కేంద్రప్రభుత్వం నూతనంగా ట్రిబ్యునల్ వేసిందని.. రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కొత్తగా ట్రిబ్యునల్ వేయడం కేంద్ర ప్రభుత్వ గొప్పతనం అని పేర్కొన్నారు. ఆ ట్రిబ్యునల్‌లో ప్రణాళిక బద్ధంగా అడ్వకెట్లను పెట్టుకొని వాదించుకుంటే 650 టీఎంసీలకు పైగా తెలంగాణకు నీటి వాటా వచ్చే అవకాశం ఉందన్నారు శ్రీరామ్.


Also Read:

Vajpayee Birth Anniversary: వాజ్‌పేయి జీవితం స్ఫూర్తిదాయకం: వెంకయ్య నాయుడు

Mallu Bhatti Vikramarka: అసెంబ్లీకి వచ్చే దమ్ముందా.. కేసీఆర్‌కి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ సవాల్

Updated Date - Dec 23 , 2025 | 05:10 PM