ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాకుంటే నా ఇల్లు అమ్మి చెల్లిస్తా!
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:45 AM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని..
పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తమది చేతల ప్రభుత్వమని వ్యాఖ్య
మక్తల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని.. బిల్లులు రాకుంటే తన ఇల్లు అమ్మి అయినా చెల్లిస్తానని తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. శుక్రవారం ఆయన నారాయణపేట జిల్లా మక్తల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మక్తల్ మున్సిపాలిటీకి 291 ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందిస్తోందని వివరించారు. తమది చేతల ప్రభుత్వమని, పేదలకు అండగా ఉంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ.500 కోట్లతో మక్తల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని పేర్కొన్నారు.