Ponguleti Srinivas Reddy: రెవెన్యూ రిజిస్ర్టేషన్ సర్వే విభాగాలు అనుసంధానం
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:37 AM
రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేస్తూ త్వరలో ఒకే సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్...
త్వరలో ఒకే సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలు: పొంగులేటి
హైదరాబాద్, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేస్తూ త్వరలో ఒకే సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ, రిజిస్ర్టేషన్, సర్వే విభాగాల అధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లకు సర్వే మ్యాప్ జత చేయాలని ఇప్పటికే భూభారతి చట్టంలో ఉందన్నారు. భూభారతి పోర్టల్‌లో సర్వే మ్యాప్ లింక్ చేసేలా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోర్టల్ వినియోగం సులభతరంగా ఉండేలా చూడాలని ఎన్‌ఐసీ అధికారులకు సూచించారు. కొత్తగా అభివృద్ధి చేసే సాఫ్ట్‌వేర్‌లో కోర్టు కేసులపై మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా మార్పులు చేయాలన్నారు. నక్షా లేని 5 గ్రామాల్లో రీ సర్వే కొలిక్కి వచ్చిన నేపథ్యంలో మిగిలిన 408 గ్రామాల్లో కొద్ది రోజుల్లోనే రీ సర్వే ప్రారంభిస్తామన్నారు. భూభారతి హక్కుల రికార్డులో నమోదై ఉన్న వారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు పెట్టుకుంటే కొత్త పాస్ పుస్తకం జారీ చేస్తారు. భూముల అమ్మకాలు, కొనుగోలు సమయంలో హద్దులతో కూడిన సర్వే మ్యాప్‌ను ఖచ్చితంగా జతపరచాలని భూభారతి చట్టంలో ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఈ 5 గ్రామాల్లో సర్వే మ్యాప్, భూధార్ కార్డుల జారీని అమలు చేయాలని రెవెన్యూశాఖ భావిస్తోంది. ప్రస్తుతం శిక్షణలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లు అందుబాటులోకి వచ్చాక ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News