KCR: ఫామ్‌హౌస్‌కి ఎవర్నీ రానివ్వని కేసీఆర్?
ABN , Publish Date - May 25 , 2025 | 03:56 AM
అమెరికా నుంచి వచ్చిన కవిత విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లి తండ్రిని కలుస్తారని అంతా భావించారు.
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రజ్యోతి, మే 24: అమెరికా నుంచి వచ్చిన కవిత విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లి తండ్రిని కలుస్తారని అంతా భావించారు. అది జరగలేదు. కనీసం శనివారం ఎర్రవల్లిలోకేసీఆర్‌ను కలుస్తారనుకున్నారు. వెళ్లలేదు. ఫామ్‌హౌజ్‌లోనే ఉన్న కేసీఆర్ తనను కలిసేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదా? లేక కవితే కేసీఆర్‌ను కలవడానికి ఆసక్తి చూపించలేదా? అనే విషయాలపై అస్పష్టత నెలకొంది. పార్టీ నాయకులు సైతం కేసీఆర్‌ను కలవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, గడిచిన రెండ్రోజుల్లో ఏ నాయకుడు కూడా ఫామ్‌హౌస్ దరిదాపుల్లోకి అడుగుపెట్టక పోవడం గమనార్హం. ఆయన అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణమని భావిస్తున్నారు.
హైకోర్టు నిర్మాణ కాంట్రాక్టు డీఈసీ ఇన్‌ఫ్రాకు!
హైదరాబాద్, మే 24(ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న కొత్త హైకోర్టు భవనం నిర్మాణ కాంట్రాక్టును డీఈసీ ఇన్‌ఫ్రా సంస్థ దక్కించుకుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రూ.2,583 కోట్లతో వంద ఎకరాల్లో హైకోర్టు భవనం, జడ్జిల నివాస సముదాయం, ఇతర మౌలిక వసతులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. అందుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖరారు చేశారు. తాజాగా నిర్మాణ సంస్థగా డీఈసీ ఇన్‌ఫ్రాను ఎంపిక చేశారు. ప్రధాన కోర్టు భవనం ఆరు అంతస్తులు ఉంటుంది. 63 మంది జడ్జిల కోసం నివాసాలు నిర్మిస్తారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..