Share News

Siddipet: రంగనాయకసాగర్‌లో మునిగి ఇద్దరి మృతి

ABN , Publish Date - May 04 , 2025 | 04:04 AM

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్‌ జలాశయాన్ని చూడడానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఇద్దరు బాలలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందారు.

Siddipet: రంగనాయకసాగర్‌లో మునిగి ఇద్దరి మృతి

  • బాలికను కాపాడబోయి మునిగిన బాలుడు

చిన్నకోడూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్‌ జలాశయాన్ని చూడడానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఇద్దరు బాలలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందారు. మరో ఇద్దరిని కుటుంబ సభ్యులు కాపాడారు. వరంగల్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన సయ్యద్‌ ఏజాజ్‌ అలీ, అతని భార్య ఆస్మానుప్రత్‌, పెద్ద కుమారుడు అయాజ్‌ అలీ, చిన్న కుమారుడు అర్బాజ్‌ అలీ, కూతురు ఆయెషా జాయా, అల్లుడు ముబష్షిర్‌, కోడలు నేహ సుల్తాన్‌, అదే కాలనీకి చెందిన ఎండీ అస్మా, ఆమె ఇద్దరు కూతుళ్లు మెహేరాజ్‌, మహేన్‌తో కలిసి ఓ వాహనంలో శనివారం ఉదయం రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌కు వచ్చారు.


మధ్యాహ్నం సమయంలో రిజర్వాయర్‌ బోటింగ్‌ మెట్ల సమీపంలో పిల్లలు నీటిలోకి దిగి ఆడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మెహేరాజ్‌ (13) నీటిలో మునిగింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన అర్బాజ్‌ అలీ (15) కూడా నీటిలో మునిగి పోయాడు. అతడి సోదరుడు అయాజ్‌ అలీని, సోదరి ఆయేషా జాయాను కుటుంబ సభ్యులు బయటకు లాగడంతో వారు ప్రాణాలతో బయట పడ్డారు. సమాచారం అందుకున్న చిన్నకోడూరు ఎస్‌ఐ బాలకృష్ణ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి మెహేరాజ్‌, అర్బాజ్‌ అలీ మృతదేహాలను వెలికితీశారు.


ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 04:04 AM