Tummala: యాసంగికి ఎరువుల పంపిణీలో జాగ్రత్త!
ABN , Publish Date - Jan 23 , 2025 | 03:59 AM
యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
గోదాములను అధునాతన పద్ధతులతో నిర్మించండి: తుమ్మల
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పరిధిలో నిర్మించే గోదాములను అధునాతన సాంకేతిక పద్ధతులతో నిర్మించాలని సూచించారు. బుఽధవారం సచివాలయంలో మార్కెటింగ్ శాఖ, ఎరువుల సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల సాగును దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అధునాతన సాంకేతిక పద్ధతులతో గోదాములను నిర్మించి, ఆహార ధాన్యాల నిల్వలో సాంకేతిక పద్ధతులను పాటిస్తే వాటి నాణ్యత దెబ్బతినదని మంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’