TGSRTC Jobs: ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీ: సజ్జనార్
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:01 AM
ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ తరుణంలో ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసగాళ్లు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం యాజమాన్యం దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ అనుమతితో సంస్థలో పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైందని, ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందని వివరించారు. ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా సంప్రదిస్తే యాజమాన్యం దృష్టికి తేవాలని, లేదా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ తెలిపారు.
కిషన్‌రెడ్డి కుట్రలు సాగనివ్వం: మంత్రి పొన్నం
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌కు బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహా మంత్రివర్గమంతా అపాయింట్‌మెంట్ అడిగితే రాష్ట్రపతి ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రపతిని కలవకుండా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. శాసనసభలో మద్దతు తెలిపిన బీజేపీ.. ఢిల్లీలో ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. తెలంగాణలో ఒకలా, ఢిల్లీలో మరోలా.. ఇదేం ద్వంద్వ నీతి అని నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు