TS Cyber Bureau: చైనాకు తరలించినా.. తిరిగి రాబట్టారు
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:07 AM
వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాల వస్తాయని బాధితుడి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసిన కేసు దర్యాప్తులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...
మాట్రిమోనిలో పరిచయం.. అధిక లాభాల పేరిట మోసం
క్రిప్టో కరెన్సీ రికవరీ చేసిన సీఎ్‌సబీ
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాల వస్తాయని బాధితుడి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసిన కేసు దర్యాప్తులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) రికార్డు సృష్టించింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన బాధితుడి నుంచి చైనాకు తరలి వెళ్లిన నిధుల్ని తిరిగి రాబట్టింది. చైనా దేశస్తుడి ఖాతాలో ఉన్న క్రిప్టో కరెన్సీ 2,703 యూఎ్‌సడీటీలను (భారత కరెన్సీలో సుమారు రూ. 2.38 లక్షలు) రికవరీ చేసింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రముఖ మాట్రిమోనిలో తన వివరాలు నమోదు చేశాడు. నందితా రెడ్డి అనే పేరుతో ఒక ప్రొఫైల్ రిక్వెస్ట్ రావడంతో వాట్సాప్ నంబరుతో పరిచయం పెంచుకున్నారు. నందితా రెడ్డి తనను తాను క్రిప్టో కరెన్సీ నిపుణురాలిగా చెప్పడంతో ఆమె మాటలు నమ్మి ఆన్‌లైన్‌లో సుమారు రూ. 87 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టాడు. రూ.6 కోట్లు లాభం వచ్చినట్లు చూపిస్తున్నా... విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడం, నందితా రెడ్డి నుంచి సమాధానం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిధులు చైనా దేశస్తుడు జియాంగ్ చువాష్పువాస్ ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించిన పోలీసులు అతని క్రిప్టో ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ తరహా క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్ చేయడం ఇదే మొదటిసారి అని సీఎ్‌సబీ పోలీసులు తెలిపారు. కాగా, రాయ్‌పూర్ కేంద్రంగా సాగుతున్న మిస్టర్ మింట్ క్రిప్టో సంస్థ డైరెక్టర్లు ప్రమోద్ సాహు, రాహుల్ బధారియో అరె్‌స్టతో ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కనుంచి 2,500 మంది 3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News