Share News

Suicide : ప్రియుడితో ఉండగా చూసిన తండ్రి.. అవమానంతో ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

ABN , Publish Date - Jan 29 , 2025 | 03:52 AM

ఇంట్లో ప్రియుడితో కలిసి ఉండగా తండ్రి కంటబడటం, ఆపై జరిగిన గొడవతో అవమానం భారం తాళలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హనుమకొండ జిల్లా కేయూ పోలీ్‌సస్టేషన్‌ పరిధి గోపాల్‌పూర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. గోపాల్‌పూర్‌కు చెందిన ఓ బాలిక సుబేదారిలోని ఓ కళాశాలలో ఇంటర్‌

 Suicide : ప్రియుడితో ఉండగా చూసిన తండ్రి.. అవమానంతో ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఘటన

ఫస్టియర్‌లో సీనియర్‌తో పరిచయం

ఇటీవల స్వస్థలానికి వచ్చిన యువకుడు

బాలికను కలిసేందుకు ఆమె ఇంటికి..

గుర్తించిన పక్క నివాసంలో మేనమామ

పట్టుబడడంతో యువకుడిపై దాడి!

అవమాన భారంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ప్రియుడితో ఉండగా తండ్రి చూడటంతో మనస్తాపం

వరంగల్‌ క్రైం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : ఇంట్లో ప్రియుడితో కలిసి ఉండగా తండ్రి కంటబడటం, ఆపై జరిగిన గొడవతో అవమానం భారం తాళలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హనుమకొండ జిల్లా కేయూ పోలీ్‌సస్టేషన్‌ పరిధి గోపాల్‌పూర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. గోపాల్‌పూర్‌కు చెందిన ఓ బాలిక సుబేదారిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ఆ బాలిక తల్లిదండ్రులు ప్రైవేటు ఉద్యోగులు. ఇంటర్‌ ఫస్టియిర్‌ చదువుతున్న సమయంలో ఓ సీనియర్‌ విద్యార్థితో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పోచమ్మమైదాన్‌కు చెందిన సదరు యువకుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ బీటెక్‌ ఫస్టియిర్‌ చదువుతున్నాడు. ఇటీవల స్వస్థలానికి వచ్చాడు. అయితే, బాలిక తల్లిదండ్రులు ఎప్పటిల్లానే మంగళవారం ఉదయం విధులకు వెళ్లిపోగా.. ఆ బాలిక కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. మధ్యా హ్న సమయంలో ఆమెను కలిసేందుకు ప్రియు డు ఇంటికి రాగా అదే సమయంలో బాలిక తండ్రి మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చా డు. తండ్రి రాకతో బాలిక ఆ యువకుడిని ఇంటో ్లని ఓ గదిలో దాచి పెట్టింది. భోజనం అనంతరం తండ్రి తిరిగి విధులకు వెళ్లిపోగా.. వారి పక్కంటిలో నివసించే బాలిక మేనమామ అనుమానంతో బాలిక తండ్రికి ఫోన్‌ చేసి వెనక్కి పిలిపించాడు. తండ్రి ఇంటి తలుపు కొట్టగా.. ఎవరో అ నుకుని బాలిక తలుపులు తీయగా ఇంట్లోకి ప్రవేశించిన తండ్రికి ఆ యువకుడు కనిపించాడు. దీంతో ఆ యువకుడు పారిపోయేందుకు యత్నించగా బాలిక తండ్రి, మేనమామ పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అవమాన భారంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్యకు యత్నించింది. అయితే, ఆ ఇంటి సమీపంలో నివసించే ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ అక్కడికి చేరుకుని బాలికను కిందికి దించి సీపీఆర్‌ చేసి బతికించేందుకు యత్నించాడు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే బాలిక మరణించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అప్పటికే సదరు యువకుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుండగా.. అతడి గొంతుకు కత్తి గాట్లున్నాయని, బాలిక కుటుంబసభ్యులు అతడిని చంపేందుకు ప్రయత్నించారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ఘటనపై రాత్రి 10:30గంటల వరకు తమకు ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం

Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 03:52 AM