Cyberabad: సైబరాబాద్‌లో భారీ వాహనాల ఎంట్రీపై ఆంక్షలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 10:03 AM
భారీ వాహనాల రాకపోకలపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రద్దీ సమయాల్లో రోడ్లపైకి భారీ వాహనాలు రావడం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రధాన రోడ్లపై భారీ వాహనాలు బ్రేక్‌డౌన్ కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
హైదరాబాద్ సిటీ: భారీ వాహనాల రాకపోకలపై సైబరాబాద్(Cyberabad) పోలీసులు ఆంక్షలు విధించారు. రద్దీ సమయాల్లో రోడ్లపైకి భారీ వాహనాలు రావడం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రధాన రోడ్లపై భారీ వాహనాలు బ్రేక్‌డౌన్ కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. బుధవారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై డీసీఎం ఆగిపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వాహనాన్ని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
డీసీఎం, రెడీమిక్స్ వాహనాలు..
డీసీఎం, రెడీమిక్స్ వాహనాలను ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అనుమతిస్తామని, తిరిగి రాత్రి 10.30 నుంచి ఉదయం 7.30 గంటల మధ్య రాకపోకలకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి ఉండే రెడీమిక్స్ కాంక్రీట్ వాహనాలు, సీ అండ్ డీ వాహనాలను అన్ని మార్గాల్లో అనుమతిస్తామన్నారు.

రాత్రి 10.30 గంటల తర్వాతే ప్రైవేట్ బస్సులకు అనుమతి
హైదరాబాద్ మహానగరానికి నిత్యం వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి వేలాది ప్రైవేట్ బస్సులు వచ్చి వెళ్తుంటాయి. వీటిని రాత్రి 10.30 నుంచి ఉదయం 7 గంటల మధ్య అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఓఆర్‌ఆర్ మీదుగా రాకపోకలు సాగిస్తూ రేడియల్ రోడ్లపై తక్కువ దూరం ప్రయాణించే బస్సులకు మినహాయింపు ఉంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News