Share News

Farmers: సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందించండి

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:21 AM

రైతు భరోసాతో పాటుగా స్ర్పేయర్లు, టార్పాలిన్లు, రోటవేటర్లు వంటి వ్యవసాయ యంత్రాలు, డ్రిప్‌ పరికరాలను సబ్సిడీపై అందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి కోరారు.

Farmers: సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందించండి

  • తుమ్మలకు హర్షవర్ధన్‌ రెడ్డి వినతి

  • రేవంత్‌.. తెలంగాణ ఫార్మర్స్‌ చాంపియన్‌: మేడిపల్లి సత్యం

  • తపస్సు చేసినా కేటీఆర్‌ సీఎం కాలేడు: పటేల్‌ రమే్‌షరెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసాతో పాటుగా స్ర్పేయర్లు, టార్పాలిన్లు, రోటవేటర్లు వంటి వ్యవసాయ యంత్రాలు, డ్రిప్‌ పరికరాలను సబ్సిడీపై అందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వేరుసెనగ పండించే రైతులు ఎక్కువగా ఉన్నందున.. వారికి సబ్సిడీపై స్ర్పింక్లర్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో తుమ్మలను కలిసిన ఆయన.. ఈమేరకు విజ్ఞప్తి చేశారు. కాగా ‘సీఎం రేవంత్‌రెడ్డి.. ఛాంపియన్‌ ఆఫ్‌ తెలంగాణ ఫార్మర్స్‌’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనియాడారు.


రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నామన్నారు. ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. కాగా జైలుకు వెళితే సీఎం అవుతానన్న భ్రమల్లో ఉన్న కేటీఆర్‌.. పదే పదే జైలు ఆలోచన చేస్తున్నాడని, ఆయన జైలుకు వెళ్లినా.. తలకిందులుగా తపస్సు చేసినా సీఎం కాలేడని కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 04:21 AM