Share News

టీచర్ల ప్రోత్సాహంతోనే ఫస్ట్‌ ర్యాంక్‌

ABN , Publish Date - May 25 , 2025 | 04:03 AM

మాది బీహెచ్‌ఈఎల్‌లోని న్యూఎంఐజీ కాలనీ. పాలీసెట్‌ ఎంపీసీ విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది.

టీచర్ల ప్రోత్సాహంతోనే ఫస్ట్‌ ర్యాంక్‌

మాది బీహెచ్‌ఈఎల్‌లోని న్యూఎంఐజీ కాలనీ. పాలీసెట్‌ ఎంపీసీ విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, టీచర్ల సహకారం, ప్రోత్సాహంతో పాలిసెట్‌కు చదివాను. పదో తరగతిలో 590 మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్‌లో సీఎ్‌సఈ పూర్తిచేసి మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నాను. - వీసవరం దీక్షిక

ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం

ఐఏఎస్‌ కావలన్నదే నా లక్ష్యం. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం సహకారంతోనే మొదటి ర్యాంకు సాధించా. పదో తరగతిలో 569 మార్కులు వచ్చాయి.

- లాస్యశ్రీ

ఐఐటీ సీటు సాధించడమే లక్ష్యం

ఐఐటీ సీటు సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నా. ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌పై ఆసక్తి ఉంది. రాకెట్‌ ప్రయోగాలు చేయడంలో ఇష్టం ఉంది.

- జి.శ్రీజ

Updated Date - May 25 , 2025 | 04:03 AM