Toll-Free Service: ఊరిలో కరెంట్ పోయినా 1912కు ఫోన్ చేయొచ్చు
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:30 AM
వచ్చే వేసవి కాలంలో పెరిగే విద్యుత్ డిమాండుకు తగ్గట్టుగా వేసవి కాల కార్యాచరణ ప్రణాళిక కోసం, వివిధ జిల్లాల పరిధిలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పరిశీలించేందుకు గాను పలువురు అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
టోల్‌ఫ్రీ నంబరు సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ
సరఫరాపై పర్యవేక్షణకు నోడల్ అధికారులు
హైదరాబాద్, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఇంతకాలం గ్రేటర్ హైదరాబాద్‌కే పరిమిత మైన విద్యుత్ సరఫరాలో అంత రాయం కలిగితే సంప్రదించే టోల్‌ఫ్రీ నంబరు 1912 సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ దక్షిణ డిస్కమ్ ఎస్పీడీసీఎల్-హైదరాబాద్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇకపై గ్రామాల్లో కరెంట్ పోతే నేరుగా 1912 నంబరుకు ఫోన్ చేయవచ్చు. సరఫరాలో అంతరాయం కలిగినా, ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి తలెత్తినా టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలని దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ఒక ప్రకటనలో సూచించారు.వచ్చే వేసవి కాలంలో పెరిగే విద్యుత్ డిమాండుకు తగ్గట్టుగా వేసవి కాల కార్యాచరణ ప్రణాళిక కోసం, వివిధ జిల్లాల పరిధిలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పరిశీలించేందుకు గాను పలువురు అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
నాగర్‌కర్నూలు జిల్లాకు డాక్టర్ ఎన్.నర్సింహులు, సంగారెడ్డి జిల్లాకు నంద కుమార్, సిద్దిపేట జిల్లాకు సాయిబాబా, నల్గొండ జిల్లాకు బిక్షపతి, వికారాబాద్ జిల్లాకు ఆనంద్, గద్వాల జిల్లాకు కె.భాస్కర్, వనపర్తి జిల్లాకు రంగనాథ్‌రాయ్, నారాయణపేట జిల్లాకు ప్రభాకర్, హైదరాబాద్ జిల్లాకు చక్రపాణి, మహబూబ్‌నగర్ జిల్లాకు నర్సింహాస్వామి, రంగారెడ్డి జిల్లాకు పాండ్య, మెదక్ జిల్లాకు బాలస్వామి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు కామేష్, యాదాద్రి జిల్లాకు ప్రతిమా షోమ్, సూర్యాపేట జిల్లాకు బి.రవిలను నోడల్ అధికారులుగా నియమించారు.