Hyderabad: జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లో ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ
ABN , Publish Date - May 31 , 2025 | 09:53 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యంను మూడునెలలకు ఒకేసారి అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆదివారం నుంచి ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రేషన్ షాపులు పని చేయనున్నాయి.
హైదరాబాద్: ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే సన్న బియ్యం ఈసారి మూడు నెలలకు కలిపి ఒకే నెలలో ఇవ్వనున్నారు. ఈ మేరకు సివిల్ సప్లయిస్ విభాగం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. బాలాపూర్(Balapur) మండలంలోని షాపులన్నింటికీ బి య్యం సరఫరా కూడా జరిగింది. గతంలో ఏ నెలకానెల బియ్యం పంపిణీ జరిగేది. అయితే ఈ సారి మాత్రం ఒకే నెలలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జూన్ నెలలోని అన్ని రోజుల్లో రేషన్ షాపులు తెరిచి ఉంచుతారు. ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రేషన్ షాపులు పని చేయనున్నాయి. బాలాపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన రేషన్ బియ్యం షాపులకు వచ్చిందని,

బియ్యం అందుబాటులో ఉంచి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు టేకుల శశిధర్‌రెడ్డి చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తిరిగి సెప్టెంబరులో సన్న బియ్యం పంపిణీ ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!
Read Latest Telangana News and National News