Sangareddy: ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:54 AM
అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను అదే కాలనీలో నివాసముండే ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు చిన్నారికి తీవ్ర రక్తస్రావమై అరవడంతో సమీపంలోని స్థానికులు నిందితుల్లో ఒకరిని పట్టుకుని చితకబాదారు. నిందితులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు.