Share News

TGSRTC Recruitment 2025: తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:54 PM

టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు తెలంగాణ పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (వర్క్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.

TGSRTC  Recruitment 2025: తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్
TGSRTC Recruitment 2025

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు తెలంగాణ పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మెుత్తం 1,743 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (వర్క్‌మెన్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8:00 గంటల నుంచి అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే జరుగుతుంది. పూర్తి వివరాల కోసం https://www.tgprb.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.


Also Read:

దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌‌కు ఆప్ నేత సవాల్..

ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

For More Latest News

Updated Date - Sep 17 , 2025 | 05:38 PM