Share News

Digital Services: సారథి.. వాహన్‌.. చలో!

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:21 AM

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్థి చేసిన ‘సారథి’, ‘వాహన్‌’ డిజిటల్‌ సేవలు ఇక రాష్ట్ర ప్రజలకూ అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా రవాణా శాఖ సేవలు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఈ సేవల వెనుక ఉద్దేశం.

Digital Services: సారథి.. వాహన్‌..  చలో!

  • రాష్ట్రంలోని వాహనదారులకు ఈ డిజిటల్‌ సేవలు అందుబాటులోకి

  • నేడు సారథిని ప్రారంభించనున్న పొన్నం

  • ఆగస్టు నుంచి వాహన్‌ సేవలు అమల్లోకి

హైదరాబాద్‌, తిరుమలగిరి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్థి చేసిన ‘సారథి’, ‘వాహన్‌’ డిజిటల్‌ సేవలు ఇక రాష్ట్ర ప్రజలకూ అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా రవాణా శాఖ సేవలు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఈ సేవల వెనుక ఉద్దేశం. ఈ డిజిటల్‌ సేవల ద్వారా ప్రజలు తమ వాహనానికి సంబంధించిన, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడి నుంచైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘సారఽథి’ అప్లికేషన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ సికింద్రాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో పైలెట్‌ ప్రాజెక్టుగా బుధవారం ప్రారంభించనున్నారు. ‘వాహన్‌’ సేవలను రాష్ట్రంలో వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి తెచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


‘సారథి’ అప్లికేషన్‌తో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్థరణ, చిరునామా మార్పు, కొత్త వాహన కేటగిరి చేర్పు తదితర సేవలను దేశంలో ఎక్కడినుంచైనా పొందొచ్చు. సారథి అప్లికేషన్‌ అమలుతో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కేంద్రం ఆధ్వర్యంలో నడిచే డీజీ లాకర్‌ ప్లాట్‌ఫాం ప్రయోజనాలను పొందగలుగుతున్నారు. డీజీ లాకర్‌ ద్వారా అధికారిక డాక్యుమెంట్లను, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను డిజిటల్‌ ఫార్మాట్‌లో భద్రపరచి అవసరమైనప్పుడు పొందొచ్చు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ అసలైనదేనని ఆయా దేశాధికారులు ధ్రువీకరించుకోవడం ‘సారథి’ ద్వారా సులభం అవుతుంది. ఇతర దేశాల్లో తాత్కాలికంగా నివసించే భారతీయులు వారి ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ గడువు ముగిసినప్పుడు, భారత రాయబార కార్యాలయలో సారథి అప్లికేషన్‌ ద్వారా అక్కడే కొత్త పర్మిట్‌ (ఐడీపీ) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:21 AM