Share News

GSDP Growth: జీఎస్‌డీపీ వృద్ధి రేటులో.. తెలంగాణకు 13వ స్థానం

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:59 AM

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ ) వృద్ధి రేటు పరంగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అలాగే తలసరి ఆదాయం పెరుగుదలలో 11వ స్థానంలో ఉంది.

GSDP Growth: జీఎస్‌డీపీ వృద్ధి రేటులో.. తెలంగాణకు 13వ స్థానం

  • 2024-25లో స్థిర ధరల వద్ద 6.79 శాతంగా నమోదు

  • ఆంధ్రప్రదేశ్‌కు రెండవ స్థానం

  • ఆహార కల్తీలో దక్షిణ భారతంలో తెలంగాణకు రెండో స్థానం

  • 58% తో దేశంలోనే యూపీ టాప్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ ) వృద్ధి రేటు పరంగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అలాగే తలసరి ఆదాయం పెరుగుదలలో 11వ స్థానంలో ఉంది. ఈమేరకు 2024-25 ఆర్థిక సంవత ్సరానికి సంబంధించిన జీఎ్‌సడీపీ, తలసరి ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వృద్ధి రేట్లను పేర్కొంది. తెలంగాణ జీఎ్‌సడీపీ స్థిర ధరల వద్ద రూ.8,16,834 కోట్లుగా ఉంది. వృద్ధి రేటు 6.79 శాతంగా నమోదైంది. ఈ లెక్కన రాష్ట్రం 13వ స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుత ధరల వద్ద జీఎ్‌సడీపీ రూ.16,12,579 కోట్లు ఉండగా.. వృద్ధి రేటు 10.12 శాతంగా నమోదైంది. ఈ వృద్ధి రేటు లెక్కన తెలంగాణ 14వ స్థానంలో ఉంది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,79,751 ఉండగా.. వృద్ధి రేటు 9.61 శాతంగా నమోదైంది. ఈ వృద్ధిరేటులో రాష్ట్రం 11వ స్థానంలో నిలిచింది.


పెరిగి తగ్గిన వృద్ధి రేటు...

తెలంగాణ జీఎ్‌సడీపీలో వృద్ధి రేటు స్థిర ధరల వద్ద 2022-23 సంవత్సరంలో 6.9 శాతంగా నమోదైంది. అయితే తర్వాతి సంవత్సరం (2023-24)లో 7.4 శాతానికి పెరిగింది. తాజాగా 2024-25 సంవత్సరంలో మాత్రం మళ్లీ 6.79 శాతానికి తగ్గింది. ఇక ప్రస్తుత ధరల వద్ద చూస్తే 2023-24 సంవత్సరంలో రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.14.64 లక్షల కోట్లుగా నమోదైంది. వృద్ధి రేటు 11.9 శాతంగా ఉంది. ఈ విషయంలో దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం నిలిచింది. కానీ 2024-25 సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద జీఎ్‌సడీపీ వృద్ధి రేటు 10.12 శాతానికి తగ్గిపోయి 14వ స్థానానికి దిగజారింది.


ఏపీ రెండో స్థానంలో...

స్థిర ధరల వద్ద జీఎ్‌సడీపీ వృద్ధి రేటులో తమిళనాడు మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచాయి. 2024-25లో 8.22 శాతం వృద్ధి రేటుతో ఏపీ రెండో స్థానంలో, తలసరి ఆదాయం వృద్ధిలో మూడోస్థానంలో నిలిచింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం గాడిలో పడిందని, ఆత్మవిశ్వాసం పెంచేలా ఫలితాలు వస్తున్నాయని ఆదివారం ‘ఎక్స్‌’లో తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఈజ్‌ రైజింగ్‌’ అని వ్యాఖ్యానించారు. కేంద్రం నివేదిక ప్రకారం.. వైసీపీ హయాంలో 2023-24లో వృద్ధి రేటు కేవలం 6.19 శాతమే ఉండగా.. 2024-25లో రాష్ట్రం 8.22 శాతం వృద్ధిరేటుతో రూ.8.65 లక్షల కోట్ల జీఎ్‌సడీపీని సాధించింది. ప్రస్తుత ధరల ప్రకారం 12.02 శాతం వృద్ధిరేటుతో రూ.15.93 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ నమోదైంది. ఈ లెక్కన 5వ స్థానంలో నిలిచింది. 2024-25లో తలసరి ఆదాయం రూ.2,66,240కు చేరింది. 11.89 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. సీఎం చంద్రబాబు 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా కృషిచేస్తున్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం.. ఆయన హయాంలోనే ఏపీ రెండు సార్లు రెండంకెల వృద్ధి రేటును నమోదుచేసింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2015-16లో 12.16%, 2017-18లో 10.09% వృద్ధి రేటు సాధించినట్లు నివేదిక తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:08 AM