Share News

TG Police: ఖాకీ బెట్టింగ్‌లపై స్పెషల్‌ ఫోకస్‌..

ABN , Publish Date - Dec 23 , 2025 | 09:35 AM

పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది విధి సిర్వహణను మరిచి అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. పధానంగా గేమింగ్‌, బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం.

TG Police: ఖాకీ బెట్టింగ్‌లపై స్పెషల్‌ ఫోకస్‌..

- ఇంటర్నల్‌ ఇంటెలిజెన్స్‌ ఏర్పాటుకు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ: పోలీస్‌ శాఖలో బెట్టింగ్‌ భూతం కలకలం రేపుతోంది. గేమింగ్‌, బెట్టింగ్‌లకు బానిసలవుతున్న కొంతమంది పోలీసులు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కోలుకునే పరిస్థితిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న సంగారెడ్డిలో సందీప్‌ ఆత్మహత్య చేసుకోగా, నిన్న హయత్‌నగర్‌(Hayathnagar)లో కానిస్టేబుల్‌ కృష్ణ చైతన్య అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు తప్పుడు మార్గాలను అనుసరిస్తుండడంపై ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో అలాంటి వారిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.


city5.jpg

ఇంటర్నల్‌ ఇంటెలిజెన్స్‌

బెట్టింగ్‌ వ్యసనాలతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సిబ్బందిని గుర్తించడానికి పోలీస్ శాఖలో ఇంటర్నల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆ విభాగం ఎలా పనిచేస్తుంది? వ్యసనాలకు బానిసలైన వారిని ఎలా గుర్తిస్తారు? అనే అంశాలపై ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!

ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 23 , 2025 | 09:35 AM