Share News

Central Budget: రాష్ట్ర విభజన హామీలపై బడ్జెట్‌లో ప్రస్తావన ఏది?

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:23 AM

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర బడ్జెట్‌లో ఒక్క అంశం కూడా లేదని, బడ్జెట్‌ను సవరించి రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు.

Central Budget: రాష్ట్ర విభజన హామీలపై బడ్జెట్‌లో ప్రస్తావన ఏది?

  • కేంద్ర బడ్జెట్‌ను సవరించి హామీలను అమలు చేయాలి

  • ధర్నా చౌక్‌ వద్ద ప్రజా సంఘాల పోరాట వేదిక మహా ధర్నా

కవాడిగూడ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర బడ్జెట్‌లో ఒక్క అంశం కూడా లేదని, బడ్జెట్‌ను సవరించి రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు. విభజన హామీలు అమలు చేసేంతవరకు సమస్యలపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ధర్నాలో పలువురు నేతలు పిలుపునిచ్చారు.


ఈ ధర్నాలో కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌ వెస్లీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరఽభద్రం, తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రజలకు దూరం చేసి ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధంగా బడ్జెట్‌ ఉందని జాన్‌ వెస్లీ అన్నారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, హైస్పీడ్‌ రైల్వేలేన్‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలేదని తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

Updated Date - Feb 11 , 2025 | 05:23 AM