దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ డీఎస్‌ఆర్ విధానం
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:26 AM
తెలంగాణ అగ్నిమాపకశాఖ అమలు చేస్తున్న ఆన్‌లైన్ డీఎస్‌ఆర్ (డైలీ స్టేటస్ రిపోర్టు) విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని నిర్ణయించినట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.

అగ్నిమాపక శాఖలో అమలుకు నిర్ణయం
రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అగ్నిమాపకశాఖ అమలు చేస్తున్న ‘ఆన్‌లైన్ డీఎ్‌సఆర్ (డైలీ స్టేటస్ రిపోర్టు)’ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని నిర్ణయించినట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రమాదం జరిగినట్టు ఫోన్ వచ్చినప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్టు డీజీ వెల్లడించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 45వ ‘స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎస్‌ఎ్‌ఫఏసీ)’ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చలో అన్ని రాష్ర్టాల అగ్నిమాపక శాఖ, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖలోని అన్ని స్థాయిల సిబ్బందిని ఒకే వేదికపైకి తెచ్చి అనుసంధానించే అంశంపై డీజీ వై.నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలిండియా ఫైర్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఏఐఎ్‌ఫఎ్‌ససీబీ) ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో నిర్ణయించారు. సదస్సులో మొత్తంగా 100 ఎజెండా అంశాలపై సదస్సులో చర్చించారు. ఇందులో కేంద్ర ఫైర్ సర్వీసెస్ డీజీ వివేక్ శ్రీవాస్తవతోపాటు ఇతర రాష్ర్టాల అధికారులు పాల్గొన్నారు.
భారత్, యూకే విద్యార్థులకు శుభవార్త...
భారత్, యూకేలోని విద్యార్థులకు కొత్త అవకాశాలను అందించేందుకు కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్, గీతం యూనివర్సిటీ ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం విద్యా సహకారాన్ని పెంపొందించడం, పరిశోధనను బలోపేతం చేయడం, అంతర్జాతీయ అభ్యాస వేదికలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని రెండు సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సహకారం ద్వారా ఒక ప్రత్యేక డ్యూయల్ డిగ్రీ పీహెచ్‌డీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం డాక్టరల్ విద్యార్థులను ప్రపంచ స్థాయి పరిశోధన నెట్‌వర్క్‌లో భాగస్వాములను చేస్తుంది. విద్యార్థులు కోవెంట్రీ యూనివర్సిటీ, గీతం నుంచి అధ్యాపకుల సంయుక్త మార్గదర్శనంతో పాటు అత్యాధునిక పరిశోధన సౌకర్యాలను అందుకుంటారు. అంతేకాక, రెండు దేశాల్లోని పరిశ్రమలతో సహకారం, నిధుల అవకాశాలను కూడా పొందుతారు. గీతం కోసం విదేశీ సంస్థతో ఇటువంటి తొలి డ్యూయల్ డిగ్రీ పీహెచ్‌డీ కార్యక్రమం కాగా, కోవెంట్రీ యూనివర్సిటీకి భారతదేశంలో ఇలాంటి మొదటి సహకారం.