Share News

ఇసుకపై ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 155242

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:01 AM

రాష్ట్రంలో ఇసుక లోడింగ్‌, రవాణా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీఎల్‌) టోల్‌ ఫ్రీ నంబర్‌ 155242 ను ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ 24 గంటల పాటు ఈ నంబర్‌ పని చేస్తుందని తెలిపింది.

ఇసుకపై ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 155242

హైదరాబాద్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక లోడింగ్‌, రవాణా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీఎల్‌) టోల్‌ ఫ్రీ నంబర్‌ 155242 ను ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ 24 గంటల పాటు ఈ నంబర్‌ పని చేస్తుందని తెలిపింది. ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఫిర్యాదు లేదా విజ్ఞాపనకు అధికారులు ఒక యూనిక్‌ ఇంటర్నల్‌ ట్రాకింగ్‌ నంబర్‌ను కేటాయించి, ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు ఫాలో అప్‌ చేస్తారని వివరించింది. ఒకవేళ సమస్య ఇతర శాఖలకు చెందినదైతే దానిని సంబంధిత శాఖలకు, జిల్లాలకు పంపిస్తామని తెలిపింది.

Updated Date - Mar 07 , 2025 | 04:01 AM