Share News

High Court:సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోండి..

ABN , Publish Date - Feb 14 , 2025 | 04:10 AM

సినిమా థియేటర్ల లోకి రాత్రి 11 తర్వాత.. ఉదయం 11 గంటలకు ముందు 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించకుండా నిషేధం విధించిన అంశం పై.. సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోవాలని, మధ్యంతర ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

High Court:సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోండి..

  • రాత్రిళ్లు థియేటర్లలోకి పిల్లలకు ప్రవేశంపై

  • స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

  • పిటిషన్‌ను ఉపసంహరించుకున్న

  • మల్టీప్లెక్స్‌ యాజమాన్యాల సంఘం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): సినిమా థియేటర్ల లోకి రాత్రి 11 తర్వాత.. ఉదయం 11 గంటలకు ముందు 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించకుండా నిషేధం విధించిన అంశం పై.. సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోవాలని, మధ్యంతర ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల లో ఇంప్లీడ్‌ అవ్వాలని మల్టీప్లెక్స్‌ యాజమాన్యాల సంఘానికి డివిజన్‌ బెంచ్‌ సూచించింది. ఇటీవల పుష్ప-2 తొక్కిసలాట, గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు స్పెషల్‌ షోకు అనుమతి ఇవ్వడంపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాత్రి 11 గంటల తర్వాత పిల్లల ప్రవేశంపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి అన్ని వర్గాలతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని.. అప్పటి వరకు పిల్లల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నామని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.


ఈ తీర్పు వల్ల నష్టపో తున్నా మని పేర్కొంటూ మల్టిప్లెక్స్‌ యజమాన్యాల సంఘం డివిజ న్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. వీటిపై గురువారం తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ సుజాయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకల ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్‌ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వు లు మాత్రమే జారీచేసిందని.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జిని ఆశ్రయించి, అక్కడ వాదనలను వినిపించాలని సూచించింది. దీంతో.. సింగిల్‌ జడ్జి వద్ద ఇంప్లీడ్‌ కావడానికి వీలుగా.. ప్రస్తుత అప్పీళ్లను ఉపసం హరించు కున్నట్లు మల్టిప్లెక్స్‌ యాజమాన్యాల సంఘం వెల్లడించింది.

Updated Date - Feb 14 , 2025 | 04:10 AM