Ponguleti : మున్నేరు-పాలేరు లింక్ కెనాల్‌కు రూ.162.54 కోట్లు విడుదల
ABN , Publish Date - May 19 , 2025 | 04:32 AM
మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.162.54 కోట్లు విడుదల చేసింది. వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించడానికి.. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టును చేపట్టారు.
సముద్రంలోకి పోయే నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా మళ్లింపు
సీఎం రేవంత్, సాగునీటి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.162.54 కోట్లు విడుదల చేసింది. వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించడానికి.. మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టును చేపట్టారు. దీనికి నిధులు విడుదల చేస్తూ జీవో నెంబర్ 98ని విడుదల చేశామని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సముద్రంలోకి పోయే వరద నీటిని రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని పదేళ్లు ఏలిన ప్రభుత్వానికి రాలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వృథాగా పోతున్న వరద నీటిలో 10 టీఎంసీల వరద నీటిని పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించవచ్చని తెలిపారు.
దీనివల్ల ఈ రిజర్వాయర్ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, ఇందు లో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందన్నారు. పాలేరు లింక్ కెనాల్‌కు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో పది చెరువులకు సాగునీటి కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఏటా వర్షాకాలంలో వరద నీరు వృధా కాకుండా ఒడిసి పట్టాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. నిర్దేశించిన గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News