Share News

TG EAPCET: ఎప్‌సెట్‌-2025 దరఖాస్తు మార్చి 1కి వాయిదా

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:34 AM

ఈనెల 25న సాయంత్రం నుంచి ప్రారంభం కావాల్సిన టీజీ ఎప్‌సెట్‌-2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది.

TG EAPCET: ఎప్‌సెట్‌-2025 దరఖాస్తు మార్చి 1కి వాయిదా

  • నాన్‌లోకల్‌ క్యాటగిరీపై స్పష్టత లేకపోవడంతోనే..

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఈనెల 25న సాయంత్రం నుంచి ప్రారంభం కావాల్సిన టీజీ ఎప్‌సెట్‌-2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఎప్‌సెట్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, నాన్‌లోకల్‌ క్యాటగిరీలో ప్రవేశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేశారు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. మరోవైపు ఎప్‌సెట్‌ దరఖాస్తుకు సమర్పించాల్సిన పత్రాల్లో కీలకమైన ఇంటర్‌ హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు ఇంకా జారీ చేయలేదు. దీంతో పలువురు అభ్యర్థులు తమ కళాశాలలు, మీ సేవాకేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది.

Updated Date - Feb 26 , 2025 | 04:34 AM