Share News

TET 2025: జూన్‌ 15 నుంచి టెట్‌

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:48 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ.

TET 2025: జూన్‌ 15 నుంచి టెట్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ. నరసింహారెడ్డి శుక్రవారం వెల్లడించారు. డీఈడీ, బీఈడీ, భాషా పండిత్‌, తత్సమాన అర్హతలు కలిగినవారు టెట్‌కు అర్హులు. ఈనెల 15 నుంచి 30 తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


రుసుమును ఒక్కో పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు కలిపి అయితే రూ.1000 లుగా నిర్ణయించారు. పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Updated Date - Apr 12 , 2025 | 04:48 AM