Share News

ఆ ఘనత మాదే.. కాదు మాదే!

ABN , Publish Date - Mar 02 , 2025 | 03:47 AM

వరంగల్‌ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మామునూరు ఎయిర్‌ పోర్టుకు అనుమతి తీసుకొచ్చింది ‘మా పార్టీ అంటే.. కాదు మా పార్టే’ అంటూ బేజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు.

ఆ ఘనత మాదే.. కాదు మాదే!

  • ‘మామునూరు’పై బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

మామునూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మామునూరు ఎయిర్‌ పోర్టుకు అనుమతి తీసుకొచ్చింది ‘మా పార్టీ అంటే.. కాదు మా పార్టే’ అంటూ బేజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారితీసింది. మామునూరు విమానాశ్రయ పనులకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రధాని మోదీ చిత్ర పటానికి పుష్పాభిషేకం చేసేందుకు ముందుగా బీజేపీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్‌ కార్యకర్తలతో కలిసి అక్కడకు వచ్చారు.


అదే సమయంలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కూడా వచ్చారు. ఈ క్రమంలో పనులకు అనుమతి సాధించిన ఘనత తమదే అంటే.. కాదు తమదే అంటూ ఇరుపక్షాల నాయకులు వాదోపవాదాలకు దిగడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Updated Date - Mar 02 , 2025 | 03:47 AM