Etela Rajender: ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - May 13 , 2025 | 05:26 AM
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం బాచుపల్లిలో సీఎంపై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఆయన ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
సీఎంపై అనుచిత వ్యాఖ్యలతో ఆయన ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపు
పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కొట్లాడితే ధీరుడితో కొట్లాడాలి..
కార్యకర్తల సమావేశంలో ఈటల ఘాటు వ్యాఖ్యలు
మేడ్చల్ ప్రతినిధి, హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం బాచుపల్లిలో సీఎంపై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఆయన ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునే బీజేపీ, బీజేవైఎం శ్రేణులు పెద్దఎత్తున మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పూడూరు పరిధి ఓఆర్‌ఆర్ పక్కన ఉన్న ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పోలీసులు పలువురు యూత్‌కాంగ్రె్‌స నేతలను అదుపులోకి తీసుకుని సమీప పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఈటల... సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘కొట్లాడితే ధీరుడితో కొట్లాడాలి.. రండలతో ఏం కొట్లాడుతాం.. రేవంత్‌రెడ్డి సీఎం కాకముందే తడిబట్టలతో భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు పిలిస్తే ధీరుడనుకున్న... కాని ఇలా ఏడుస్తడు అనుకోలేదు.. ఏడ్చేవాళ్లను ఏం అంటారో మీ అందరికీ తెలుసు’ అని ఈటల వ్యాఖ్యానించారు. కాగా ఈటల.. లెఫ్ట్ వింగ్ నుంచి బీజేపీ రైట్‌వింగ్‌లోకి వెళ్లే సరికి మెదడు చెడినట్టుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డిని తిడితే బీజేపీలో ఆయనకు పదవులొస్తాయని భ్రమపడుతున్నారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరంటూ ఎంపీ ఈటల రాజేందర్‌ను టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే మూడు ముక్కలు, నాలుగు చెక్కలు కాబోతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. పార్టీ నుంచి కవిత, హరీశ్‌రావులను బయటికి పంపాలని కేటీఆర్ చూస్తున్నాడన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News