నాకు తెలియకుండా పదవులు ఎలా ఇస్తారు?
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:47 AM
‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోని వారికి మీరు పదవులు ఎలా ఇస్తార’ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మంత్రి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది.

వెంకట్‌రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే సామేలు
డీసీసీ ఉపాధ్యక్ష పదవిపై వివాదం..
సీనియర్ నేత కాబట్టే ఇచ్చామన్న మంత్రి
మోత్కూరు, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోని వారికి మీరు పదవులు ఎలా ఇస్తార’ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మంత్రి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు పైళ్ల సోమిరెడ్డిని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం కాంగ్రె్‌సలో దుమారం లేపింది. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఈ విషయమై వాగ్వా దం జరిగినట్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమిరెడ్డి, మరికొందరు ఈ నెల 28న మంత్రి కోమటిరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ‘30 ఏళ్లు గా నేను పార్టీకోసం పనిచేస్తున్నా, మన ప్రభుత్వం వచ్చా క కూడా నాకు ఒక నామినేటెడ్ పోస్టుగాని, పార్టీ పదవిగాని లేకపాయే’ అని సోమిరెడ్డి మంత్రి వద్ద తన ఆవేదన వెలిబుచ్చారు.
డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి అక్కడే ఉండడంతో మంత్రి ఆయనతో సోమిరెడ్డిని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించి లేఖ ఇవ్వాలని చెప్పారు. దాంతో సంజీవరెడ్డి వెంటనే మంత్రి చేతుల మీదుగా ఇప్పించేందుకు లేఖ సిద్ధం చేశారు. అంతలో సామేలు అక్కడకు వెళ్లారు. ‘అప్పుడు సోమిరెడ్డిని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిం చాం.. మీ చేతుల మీదుగా ఆయనకు లెటర్ ఇవ్వండ’ని మంత్రి ఎమ్మెల్యేతో చెప్పారు. ‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోని వారికి మీరు పదవులు ఎలా ఇస్తార’ని సామేలు మంత్రిని ప్రశ్నించారు. ‘సోమిరెడ్డి చాలా సీనియర్. ఆయన సుమారు 30 ఏళ్ల నుంచి కోసం పని చే స్తున్నారు. ఆయనకు ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు ఇవ్వడం లేదు కదా! పార్టీ పదవి ఇస్తే ఎందుకు అభ్యంతరం చెబుతున్నార’ని మంత్రి అన్నారని, ఈ సందర్భంగా ఆయనకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. సో మిరెడ్డికి నియామక పత్రం ఇవ్వడానికి ఎమ్మెల్యే సామేలు నిరాకరించి వెళ్లిపోవడంతో మంత్రి వెంకట్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డితో కలిసి సోమిరెడిక్డి అందజేశారు.