Weather Report: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
ABN , Publish Date - Jan 31 , 2025 | 09:51 AM
తెలుగు రాష్ట్రాల్లో చలికాలం అయిపోయి ఎండాకాలం ప్రారంభమయినట్టే కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

Summer Alert For Andhrapradesh And Telangana: తెలుగు రాష్ట్రాల్లో చలికాలం అయిపోయి ఎండాకాలం ప్రారంభమయినట్టే కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. దక్షిణాది రాష్ట్రాలపై ఉన్న ద్రోణి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండ ఎక్కువగా ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాలపై తేలికపాటి మేఘాలు వస్తూ పోతూనప్పటికీ వేడి ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 15 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అందువల్ల ఏపీలో గాలి వేగం గంటకు 11 కిలోమీటర్లుగా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో గంటకు 7 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో నేడు 32 డిగ్రీల సెల్సియస్ ఉంటే, ఏపీలో 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.కాబట్టి ఎండలో ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమంగా నీరు తాగుతూ ఉండాలి.