Share News

Manohar Reddy Honored: యూకేలో తెలుగు యువకుడి ప్రతిభ

ABN , Publish Date - Aug 26 , 2025 | 02:53 AM

తెలుగు యువకుడు మనోహర్‌ రెడ్డి అంతర్జాతీయ వేదికలపై ఐటీ ఆవిష్కరణల్లో ప్రతిభను చాటారు..

Manohar Reddy Honored: యూకేలో తెలుగు యువకుడి ప్రతిభ

  • స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఐటీ ఇండస్ట్రీ అవార్డు

  • అరేనా ఇన్నోవా బ్రాండ్‌ అంబాసిడర్‌గా మనోహర్‌ రెడ్డి

లూటన్‌ (యూకే): తెలుగు యువకుడు మనోహర్‌ రెడ్డి అంతర్జాతీయ వేదికలపై ఐటీ ఆవిష్కరణల్లో ప్రతిభను చాటారు. యూకేలోని ఐటీ ఇండస్ర్టీ అవార్డ్స్‌-2025లో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి విభాగంలో రెండోసారి ఎంపికయ్యారు. 2024లో జరిగిన ఐదో ఎడిషన్‌లో ఆయన ప్రతిపాదించిన అటానమస్‌ సెక్యూరిటీ రోబోట్స్‌ ప్రాజెక్టుకు అవార్డు దక్కింది. విమానాశ్రయ భద్రతకు ఆ ప్రాజెక్టు కొత్త దిశ చూపుతుందని విశేష ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఆయన రూపొందించిన ఏఐ ఏరో ఆప్స్‌ డాష్‌బోర్డు ప్రాజెక్టుకు సైతం అవార్డు రానుంది. దీంతోపాటు మనోహర్‌రెడ్డి 2025 ఏడాదికి గాను స్పెయిన్‌లోని అరేనా ఇన్నోవాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 02:53 AM