Share News

Telangana: మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణలో రెండు కొత్త పథకాలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:08 PM

రేవంత్ సర్కార్ మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెచ్చింది. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన' కింద ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.50వేలు, 'రేవంతన్నా కా సహారా' కింద ఫకీర్, దూదేకుల వంటి..

Telangana: మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణలో రెండు కొత్త పథకాలు
Telangana new schemes

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. మైనారిటీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త పథకాలు ఉద్దేశించారు. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన' పేరుతో.. ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.50వేలు ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందిస్తారు.

ఇక, రెండోది.. 'రేవంతన్నా కా సహారా' కింద ఫకీర్, దూదేకుల వంటి.. వెనుకబడిన మైనారిటీ వర్గాలకు రూ.లక్ష గ్రాంట్‌తో మోపెడ్స్ అందిస్తారు. ఈ పథకాలకు అక్టోబర్ 6 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు నిరూపిస్తూ ఈ రెండు కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలను ఇవాళ (శుక్రవారం) సెక్రటేరియట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ పథకాలు మైనారిటీ వర్గాల్లోని వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలు, ఫకీర్, దూదేకుల వంటి వర్గాలకు సహాయం అందిస్తాయి.

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: ఈ పథకం కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ. 50,000 సహాయం అందిస్తారు. వారు చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, స్వయం ఉపాధి కల్పించుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.

'రేవంత్ అన్న కా సహారా': ఈ పథకం కింద, ఫకీర్, దూదేకుల వర్గాలకు రూ. 1 లక్ష సహాయం అందిస్తారు. వాళ్లు మోపెడ్స్ (ద్విచక్ర వాహనాలు) కొనుగోలుకు సాయం అందిస్తారు. ఫలితంగా వారు తమ జీవనోపాధిని మెరుగుపర్చుకోవడానికి ఈ పథకం సహాయపడుతుంది.

ఈ పథకాలకు రూ.30కోట్లు నిధులు కేటాయించారు. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19, 2025 నుంచి అక్టోబర్ 6, 2025 వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. ఈ పథకాల ప్రారంభోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వం మైనారిటీ వర్గాల్లోని అందరికి సమగ్ర సంక్షేమాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. ఈ పథకాలు వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తాయి' అని పేర్కొన్నారు.



ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 10:14 PM