Share News

Telangana Wonder Kid: బుడుగు కాదు పిడుగు

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:46 AM

నిండా రెండేళ్లు కూడా లేని ఈ బుడతడు అద్భుత మేధాశక్తితో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 70మంది బంధువులను పేరుతో సహా గుర్తించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం...

Telangana Wonder Kid: బుడుగు కాదు పిడుగు

  • సంవత్సరం 9 నెలలకే 70 మంది బంధువులను పేర్లతో గుర్తింపు

  • తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

జగ్గయ్యపేట, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నిండా రెండేళ్లు కూడా లేని ఈ బుడతడు అద్భుత మేధాశక్తితో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 70మంది బంధువులను పేరుతో సహా గుర్తించి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించా డు. ఈ బాలమేధావి పేరు తీక్షణ్‌సా యి. ఎన్టీఆర్‌ జిల్లా వాసవీ సేవాసమితి యువజన విభాగం అధ్యక్షుడు కుంచపర్తి సాయిరాం, లక్ష్మీ భవానీల కుమారుడు. వయ స్సు ఒక సంవత్సరం 9 నెలలు. ఇతడు తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలనే కాదు, 70 మంది బంధువుల పేర్లు చెప్పి గుర్తిస్తున్నాడు. మధిరలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తీక్షణ్‌సాయికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అవార్డు అందజేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తీక్షణ్‌సాయికి అభినందనలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 05:46 AM