ఆస్ట్రేలియాలో తెలంగాణ బృందం
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:23 AM
ఆస్ట్రేలియాలో క్రీడలు, మౌలిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం శుక్రవారం విక్టోరియా రాష్ట్రం మెల్‌బోర్న్ నగరంలో అక్కడి ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది.

మెల్‌బోర్న్‌లో క్రీడలు, మౌలిక వసతులపై అధ్యయనం
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియాలో క్రీడలు, మౌలిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం శుక్రవారం విక్టోరియా రాష్ట్రం మెల్‌బోర్న్ నగరంలో అక్కడి ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆస్ట్రేలియా దేశంలో క్రీడల అభివృద్ధి కోసం అమలుచేస్తున్న విధానాలను పరిశీలించింది. క్రీడల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంది.
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో కరాటే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు(క్రీడలు) జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఎండీ సోనీబాల, హాకీ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ ఫహీమ్ ఖురేషి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆస్ట్రేలియాలో పర్యటించి క్రీడలు, మౌలిక వసతులపై రాష్ట్ర ప్రతినిధుల బృందం అధ్యయనం చేస్తోంది.