Share News

Singareni: సింగరేణి, జెన్‌కోలకు ‘ఫైవ్‌ స్టార్‌’ !

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:17 AM

తెలంగాణ జెన్‌కో, సింగరేణి యాజమాన్యాలకు జాతీయ అవార్డు లు వరించాయి. పర్యావరణహిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ సంస్థగా

Singareni: సింగరేణి, జెన్‌కోలకు ‘ఫైవ్‌ స్టార్‌’ !

  • 4 బొగ్గు గనులకు, జెన్‌కోకు జాతీయ అవార్డులు

  • అవార్డులు ప్రదానం చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, కొత్తగూడెం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జెన్‌కో, సింగరేణి యాజమాన్యాలకు జాతీయ అవార్డు లు వరించాయి. పర్యావరణహిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ సంస్థగా ఉన్న సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 4 బొగ్గు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది.


గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి.కిషన్‌ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. అలాగే, తెలంగాణ జెన్‌కో కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తాడిచర్ల ఓపెన్‌కాస్టు-1కు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌తో పురస్కారాన్ని సాధించింది. జెన్‌కో అధికారులు ఈ అవార్డును కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.

Updated Date - Sep 05 , 2025 | 04:17 AM