Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు
ABN , Publish Date - Dec 02 , 2025 | 08:56 PM
తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు (Rising Global Summit).
గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రత్యేక వేదికను ఫ్యూచర్ సిటీలో రూపొందిస్తున్నారు. సమ్మిట్‌లో భాగంగా మూడు వేల డ్రోన్లతో షోను ఏర్పాటు చేస్తున్నారు. సమ్మిట్‌లో కీలక ఒప్పందాల చేసుకునేందుకు పలువురు పెట్టుబడి దారులు ముందుకు వస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కార్యక్రమానికి వీలైనంత మంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైతే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్రాల వారీగా ఆ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు (Hyderabad investment summit).
జమ్మూ కశ్మీర్, గుజరాత్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
పంజాబ్, హర్యానా - దామోదర్ రాజనర్సింహ
ఆంధ్రప్రదేశ్ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కర్ణాటక, తమిళనాడు - దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఉత్తరప్రదేశ్ - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాజస్థాన్ - పొన్నం ప్రభాకర్
ఛత్తీస్‌గడ్- కొండ సురేఖ
వెస్ట్ బెంగాల్ - సీతక్క
మధ్యప్రదేశ్ - తుమ్మల నాగేశ్వరరావు
అసోం - జూపల్లి కృష్ణా రావు
బీహార్ - వివేక్ వెంకటస్వామి
ఒడిశా - వాకిటి శ్రీహరి
హిమాచల్ ప్రదేశ్- అడ్లూరు లక్ష్మణ్ కుమార్
మొహమ్మద్ అజారుద్దీన్ - మహారాష్ట్ర
ఢిల్లీ సీఎం, కేంద్ర మంత్రులు, గవర్నర్లను ఆహ్వానించే బాధ్యత రాష్ట్ర ఎంపీలకు అప్పగించారు.
ఇవీ చదవండి:
71ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్
సబ్‌వేలో సడెన్‌గా ఆగిపోయిన చెన్నై మెట్రో రైలు.. ట్రాక్స్ వెంబడి ప్రయాణికుల నడక