జాతీయ పోలీసు క్రీడా పోటీల్లో తెలంగాణ జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షి్‌ప
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:20 AM
ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈ నెల 10వ తేది నుంచి శనివారం వరకు జరిగిన జాతీయ పోలీసు క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర పోలీసులు మొత్తంగా 18 పతకాలు గెలుచుకుని ఓవరాల్ చాంపియన్‌షి్‌ప సాధించారు.
18 పతకాలతో అగ్రస్థానం..సీఎం, డీజీపీ అభినందనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈ నెల 10వ తేది నుంచి శనివారం వరకు జరిగిన జాతీయ పోలీసు క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర పోలీసులు మొత్తంగా 18 పతకాలు గెలుచుకుని ఓవరాల్ చాంపియన్‌షి్‌ప సాధించారు. వివిధ క్రీడలు, శాస్త్రీయ పోటీల్లో ఆరు బంగారు పతకాలతో పాటు నాలుగు రజత, 8 కాంస్య పతకాల గెలుచుకున్నట్లు పోలీసు డ్యూటీ మీట్ నోడల్ అధికారి షికా గోయల్ తెలిపారు.
క్రీడల ముగింపు కార్యక్రమంలో ఝార్ఖండ్ ఆర్థికమంత్రి రాధాకృష్ణ కిశోర్ పాల్గొని తెలంగాణ పోలీసు బృంద నాయకుడురాంరెడ్డికి ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీ అందజేశారు. తెలంగాణ పోలీసులు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడంపై సీఎం రేవంత్, డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు వారు అభినందనలు తెలిపారు.