Investigation of defecting MLAs: ఈరోజు నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
ABN , Publish Date - Nov 06 , 2025 | 08:24 AM
ఈరోజు నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరుగనుంది. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ Vs వివేకానంద గౌడ్ కేసు విచారణ జరుగనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ Vs జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది.
హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఈరోజు నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరుగనుంది. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ Vs వివేకానంద గౌడ్ కేసు విచారణ జరుగనుంది. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. పిటిషనర్ వివేకానంద ను తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
ఇక మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ Vs జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది. సంజయ్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జగదీశ్ రెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రేపు మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. రేపు ఉదయం 11 గంటలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి Vs మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది. పోచారంపై జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ వేసిన జగదీశ్ రెడ్డిని పోచారం తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ Vs కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరుగనుంది. పార్టీ మారారని గాంధీపై కల్వకుంట్ల సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ వేసిన కల్వకుంట్ల సంజయ్ ను గాంధీ తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. 12, 13 తేదీలలో స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు. అటు ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా ఈరోజు నుండి అసెంబ్లీలో ఆంక్షలు విధించారు. ఈ వ్యవహారంపై కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటికీ అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
Alcohol Sales: ఎక్సైజ్ శాఖకు.. ఒక్క నెలలోనే భారీగా ఆదాయం..
Highway After Deadly Accident: ఎట్టకేలకు రోడ్డు విస్తరణ షురూ