Share News

Telangana Launches Vyuhya Lab: వ్యూహా ల్యాబ్‌తో సైబర్‌ నేరాలకు చెక్‌

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:06 AM

పెరుగుతున్న సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు గచ్చిబౌలిలోని ట్రిపుల్....

Telangana Launches Vyuhya Lab: వ్యూహా ల్యాబ్‌తో సైబర్‌ నేరాలకు చెక్‌

  • ట్రిపుల్‌ఐటీ-హెచ్‌తో కలిసి..ఆవిష్కరించిన డీజీపీ జితేందర్‌, సీఎ్‌సబీ చీఫ్‌ శిఖాగోయల్‌

హైదరాబాద్‌సిటీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ-హెచ్‌తో కలిసి వ్యూహా ల్యాబ్‌ను ఆవిష్కరించారు. ట్రిపుల్‌ ఐటీ 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ డాక్టర్‌ జితేందర్‌, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎ్‌సబీ) చీఫ్‌ శిఖాగోయల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సైబర్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌-వ్యూహా ల్యాబ్‌తోపాటు.. సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ నెక్ట్స్‌జెన్‌ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌ నెట్‌వర్క్‌(మంథన్‌)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సంప్రదాయ నేరాలను సైబర్‌ నేరాలు అధిగమిస్తున్నాయన్నారు. ‘‘గతంలో దోపిడీలు, చోరీలు అధికంగా జరిగేవి. ఇప్పుడు మొత్తం నేరాల్లో 22-25ు సైబర్‌ నేరాలే ఉంటున్నాయి. ఈ నేరాల కట్టడికి తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాలకు కూడా సహాయం చేస్తున్నారు. విద్య, పరిశోధన రంగాలకు చెందిన వారిని వ్యూహా ల్యాబ్‌తో అనుసంధానం చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. శిఖా గోయల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు వ్యూహా ల్యాబ్‌ గేమ్‌చేంజర్‌ అవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోనే టీజీసీఎ్‌సబీ వినూత్న పోలీసింగ్‌ విభాగం అని పేర్కొంటూ.. తమ బ్యూరో పనితీరును వివరించారు. 2026కల్లా ప్రపంచవ్యాప్తంగా సైబర్‌నేరాల కారణంగా 11.9 ట్రిలియన్‌ డాలర్ల నష్టం జరగనున్నట్లు అంచనాలున్నాయన్నారు. గత ఏడాది భారత్‌లో రూ.24 వేల కోట్లను సైబర్‌ నేరగాళ్లల కొల్లగొట్టారని, అందులో తెలంగాణ పౌరులు నష్టపోయింది రూ.1,900 కోట్లని చెప్పారు. దేశంలో సైబర్‌ నేరాలు 37ు వృద్ధిని నమోదు చేసుకోగా.. తెలంగాణలో 11ు తగ్గాయని పేర్కొన్నారు. కాగా.. ట్రిపుల్‌ ఐటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. గూగుల్‌ డీప్‌మైండ్‌లో రిసెర్చ్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న మనీశ్‌జైన్‌, రూట్జర్స్‌ రాబర్ట్‌వుడ్‌ జాన్సన్‌ మెడికల్‌ స్కూల్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నవీన యనమల ఈ అవార్డులను అందుకున్నారు.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 04:06 AM