Rice Mills Tender Agencies: ‘టెండరు ధాన్యం’లో దోషులు ఎవరు?
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:19 AM
రైస్ మిల్లర్ల దగ్గర మిగిలిపోయిన టెండరు ధాన్యం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది.
చర్యలు బిడ్డర్లపైనా.. మిల్లర్లపైనా?
నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చ!
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రైస్ మిల్లర్ల దగ్గర మిగిలిపోయిన టెండరు ధాన్యం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. నిర్ణీత వ్యవధిలో ధాన్యం ఎత్తకుండా ఏడాదిన్నర జాప్యం చేసిన టెండరు ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటుందా? ఏజెన్సీలకు సహకరించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈఎండీ జప్తు చేయడం ద్వారా టెండరు ఏజెన్సీలకు; మిగిలిపోయిన ధాన్యం నిల్వలపై 25 శాతం జరిమానా విధించడం ద్వారా మిల్లర్లకు శిక్ష వేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
అయితే బిడ్డర్లు ఢిల్లీలో మకాం వేసి ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ధాన్యం టెండర్ల అంశాన్ని అజెండాగా పెట్టినట్లు తెలిసింది. ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఈ సమావేశంలో తేలనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News