Bhatti Vikramarka: విద్యుత్ సంస్కరణల పథకంలో చేరతాం
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:01 AM
విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివాంప్డ్ డిస్ర్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎ్‌సఎ్‌స)లో రాష్ట్రం చేరనుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

ఆర్‌డీఎ్‌సఎ్‌సలో చేరికపై ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టత
హైదరాబాద్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివాంప్డ్ డిస్ర్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎ్‌సఎ్‌స)లో రాష్ట్రం చేరనుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలను, సాధించిన పురోగతిని ఆయన మీడియాకు వివరించారు. 2021 ఆగస్టు 17న కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్‌డిఎ్‌సఎస్ పథకంలో చేరినా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రామగుండంలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలోనే 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గాను ఇటీవల న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటించామన్నారు. కొత్త పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు రానున్నందున భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందన్నారు.