Fish industry: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:16 AM
తెలంగాణలో మత్స్యకారుల (గంగపుత్రుల) సంక్షేమం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాం.. ఇటీవలే 120 కోట్లు విడుదల చేశాం: మంత్రి పొన్నం
చేపలంటేనే తెలంగాణ గుర్తుకు రావాలి: మహేశ్ గౌడ్
గంగపుత్రులు కేంద్ర సబ్సిడీలను వినియోగించుకోవాలి: దత్తాతేయ్ర
ఖైరతాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మత్స్యకారుల (గంగపుత్రుల) సంక్షేమం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గంగ తెప్పోత్సవం అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌లో గంగపుతుల్ర ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాతేయ్ర తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, చేపల వృత్తిదారులకు కోల్డ్ స్టోరేజీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గంగపుతుల్ర సమస్యలపై ముఖ్యమంత్రితో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవలే మత్స్యకారుల అభివృద్ధికి రూ. 120 కోట్లు విడుదల చేశామని కూడా ఆయన గుర్తు చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, చేపలంటేనే తెలంగాణ గుర్తుకు వచ్చేలా మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేద్దామని సూచించారు.
కుల వృత్తులన్నింటికీ పూర్వ వైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నారని ఆయన తెలిపారు. మాజీ గవర్నర్ బండారు దత్తాతేయ్ర మాట్లాడుతూ, కుల వృత్తిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. ఈ నిధులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్రం 60 శాతం సబ్సిడీ ఇస్తున్నందున, రాష్ట్రం కూడా 40 శాతం సబ్సిడీ ఇవ్వాలని ఆయన కోరారు. గంగపుతుల్రు చేపలు పట్టడంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముందు ఖైరతాబాద్ ఏడుగుళ్ల దేవాలయం నుంచి హుస్సేన్‌సాగర్‌లోని గంగమ్మ దేవాలయం వరకు భారీ శోభాయాత్ర జరిగింది. ఇందులో 250 బోనాలు, గంగతెప్పలు, వలలు, జోగిణీ మహిళల నృత్యాలు, పోతరాజుల వీరంగాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండతోనే ప్రభుత్వాలు: మహేశ్ గౌడ్
రవీంద్రభారతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కలయికే భారతదేశమని.. మనం లేకుంటే దేశమే లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మన అండతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రసు ్తతం దేశాన్ని పాలిస్తున్న వారు మతాల పేరుతో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మహేశ్‌గౌడ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ముందుగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మోదీ గెలవడానికి ఓట్ చోరీ చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని.. రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా సామాజిక న్యాయంపై చర్చ జరుగుతోందని మంత్రి పొన్నం అన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు ఐక్యత పాటించాలని.. మన జాతి కోసం, సమస్యల పరిష్కారం కోసం కలిసి ఉద్యమించాలని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ