Share News

Third DISCOM in Telangana: తెలంగాణలో మూడవ డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Dec 17 , 2025 | 07:56 PM

తెలంగాణలో విద్యుత్ రంగంలో కీలక మార్పులకు సీఎం రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మూడో డిస్కం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.

Third DISCOM in Telangana: తెలంగాణలో మూడవ డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Third DISCOM in Telangana

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government@ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు (DISCOMs) అదనంగా మూడవ డిస్కం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా (Electricity Supply) వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల పరిధి చాలా ఎక్కువగా ఉండటం, విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, పేదల గృహాలకు 200 యూనిట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల నిర్వహణతో డిస్కంలపై పెరిగిన ఆర్థిక భారంతో పాటు ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని సంస్కరించడం మూడో డిస్కం ముఖ్య ఉద్దేశం అని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సదరన్, నార్త్‌ర్న్ డిస్కమ్స్ తో పాటు ఈ కొత్త డిస్కం పనిచేయనుంది. ఈ నిర్ణయం వల్ల విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్థిక ఇబ్బంది తగ్గడంతో పాటు పలు సంక్షేమ పథకాల అమలుకు మెరుగుపర్చడం జరుగుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.


ఇవి కూడా చదవండి...

ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజే తీర్పు

ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..

Updated Date - Dec 17 , 2025 | 08:10 PM