Share News

Subsidy Loans : దివ్యాంగులకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు

ABN , Publish Date - Jan 29 , 2025 | 04:45 AM

రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం ప్రవేశ పెట్టిన సబ్సిడీ రుణాల నిధులు మంజూరయ్యాయి. దివ్యాంగులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని చిరువ్యాపారాల వైపు ప్రోత్సహించి ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ

 Subsidy Loans : దివ్యాంగులకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు

711 యూనిట్లకు రూ.3.50 కోట్ల నిధులు విడుదల

ఫిబ్రవరి 2 వరకు ధరఖాస్తుకు అవకాశం

ఓల్డ్‌మలక్‌పేట జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం ప్రవేశ పెట్టిన సబ్సిడీ రుణాల నిధులు మంజూరయ్యాయి. దివ్యాంగులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని చిరువ్యాపారాల వైపు ప్రోత్సహించి ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ వందశాతం సబ్సిడీతో ఈ రుణాలను అందిస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 711 యూనిట్లకు రూ.3 కోట్ల 50 లక్షలు నిధులు ఇటీవల విడుదలయ్యాయి. ఎంపికైనా వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున వ్యక్తిగత రుణం అందిస్తారు. 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉండి 40 శాతం పైగా వికలాంగత్వంతో వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్ష ఆదాయం ఉన్నవారే ఈ రుణాలకు అర్హులు. అర్హులైన వారు వచ్చేనెల 2వ తేదీ లోపు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మండల స్థాయిలో ఎంపీడీవోలు పరిశీలించి రుణాలకు 1:3 నిష్పత్తిలో దరఖాస్తులను ఎంపిక చేసి జిల్లా అధికారులకు జాబితా పంపుతారు. అదనపు(అడిషనల్‌) కలెక్టర్‌ ఆధ్వర్యంలో తుది జాబితా రూపొందుతుంది. ఆన్‌ లైన్‌లో ఆ జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ రుణాల మంజూరులో ఉన్నత చదువులు చదువుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.

దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తోంది. వారికి ఆర్థికంగా చేయూత ఇస్తూ వ్యాపారాలల్లో నిలదొక్కుకునే విధంగా ఈ స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు ఉపయోగపడతాయి. ఈ రుణాలు పూరిగ్తా వందశాతం సబ్సిడీతో అందిస్తున్నాం. అర్హులైన దివ్యాంగులు నిర్ధేశించిన సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలి.



Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 04:45 AM